'ఛలో నిజామాబాద్ విజయవంతం చేద్దాం'
NEWS Jun 28,2025 10:32 pm
ఎంపీ ధర్మపురి అరవింద్ నాయకత్వంలో జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవానికి వస్తున్న కేంద్ర మంత్రి అమిత్ షాకు ఘన స్వాగతం పలకాలని, రైతు సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని బిజెపి జగిత్యాల జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు, కోరుట్ల నియోజకవర్గ నాయకులు డా. రఘు పిలుపునిచ్చారు. బిజెపి పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్, కోరుట్ల అసెంబ్లీ కన్వీనర్ చెట్లపల్లి సుఖేందర్ గౌడ్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఏలేటి నరేందర్ రెడ్డి, శ్రీకర్ గౌడ్, తుకారం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.