తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్ష ఎన్నికలకు రంగం సిద్ధం
NEWS Jun 28,2025 04:37 pm
బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ వేగవంతమైంది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు నూతన అధ్యక్షులను ఎన్నుకునేందుకు పార్టీ అధిష్ఠానం కసరత్తు ముమ్మరం చేసింది. రెండు రాష్ట్రాలకు దాదాపు ఒకే సమయంలో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి, జులై 1న నూతన సారథులను ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు పార్టీ వర్గాలు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించాయి.