ప్రకాశం జిల్లా మరిపూడి మండలంలో వేంచేసి ఉన్న మృదుల గిరి నరసింహ స్వామి ఆలయంలో కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి కావాల్సిన వసతులు సదుపాయాల గురించి ఆలయ ఈవోతో మంత్రి మాట్లాడారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలన్నారు.