ఛానల్ పై దాడి మంచి పద్ధతి కాదు
NEWS Jun 28,2025 10:27 am
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లోని మహా న్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయంపై దాడి చేయడం పట్ల స్పందించారు. మీడియాలో ప్రసారమయ్యే, ప్రచురితమయ్యే వార్తలు, కథనాలపై అభ్యంతరాలు ఉంటే తెలియచేసే విధానం ఒకటి ఉంటుందన్నారు. ఇందుకు భిన్నంగా దాడులకు పాల్పడటం సమంజసం కాదన్నారు. మహా న్యూస్ ఛానెల్ పై జరిగిన దాడిని ప్రజాస్వామ్యవాదులు తప్పనిసరిగా ఖండించాలన్నారు. ఈ దాడికి కారకులైనవారిపై చట్ట ప్రకారం తెలంగాణ సర్కార్ చర్యలు తీసుకోవాలని కోరారు