అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే తాటతీస్తా
NEWS Jun 29,2025 12:49 pm
ప్రకాశం జిల్లా కొండేపి పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలోని కొండేపి, పొన్నలూరు, మర్రిపూడి మండలాల ఎస్ఐలకు, స్టేషన్ సిబ్బందికి కొండేపి పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో పరేడ్ కార్యక్రమం నిర్వహించారు సిఐ సోమశేఖర్. ఈ కార్యక్రమంలో పోలీసుల యోగక్షేమాలు ఆయన అడిగి తెలుసుకున్నారు. సిబ్బందికి కేటాయించిన గ్రామాలలో అక్రమ మద్యం, ఇసుక, పేకాట, గంజాయి వంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుంటే ఎమ్మటే సమాచారం అందించాలని అన్నారు. తప్పు చేస్తే ఎంతటి వారినైనా జైలుకు పంపిస్తామని సిఐ సోమశేఖర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కొండేపి ఎస్సై ప్రేమ్ కుమార్, మరిపూడి ఎస్సై రమేష్, పొన్నలూరు ఎస్సై అనూక్ తోపాటు సిబ్బంది పాల్గొన్నారు.