కూటమి సర్కార్ బేకార్
NEWS Jun 28,2025 02:47 pm
ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. అన్నదాత సుఖీభవ కాదని అన్నదాత దుఖీభవ అని మండిపడ్డారు. కూటమి సర్కార్ చెప్పిన సూపర్ సిక్స్ హామీలన్నీ ఒట్టి కోతలేనంటూ పేర్కొన్నారు. 43 లక్షల మంది రైతులకు అన్యాయం చేయాలని చూస్తున్నారంటూ వాపోయారు. రాష్ట్రంలో బాబు, జగన్, పవన్ బీజేపీకి తొత్తులేనని ఆరోపించారు. బీజేపీ వ్యతిరేకంగా దత్తపుత్రుడు జగన్ ఒక్క ఉద్యమం కూడా చేయక పోవడం దారుణమన్నారు. తనకు పనికి వచ్చే ఉద్యమాలు మాత్రమే చేస్తాడన్నారు.