చంద్రబాబు, పవన్ మద్దతుతో మోదీ ధీమాగా ఉన్నారు: షర్మిల
NEWS Jun 28,2025 06:03 am
రాష్ట్రంలోని అధికార, విపక్ష పార్టీల ఎంపీలపై ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు ఎత్తును కుదిస్తున్నా టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీకి చెందిన ఎంపీల్లో ఒక్కరూ కూడా కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం చేయడం లేదని ఆమె మండిపడ్డారు.