నీరజ్ చోప్రా మళ్లీ వరల్డ్ నంబర్ వన్.. పీటర్స్‌ను వెనక్కి నెట్టిన భారత స్టార్!
NEWS Jun 28,2025 08:50 am
భారత జావెలిన్ త్రో స్టార్, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా తన సత్తాను మరోసారి ప్రపంచానికి చాటాడు. అంతర్జాతీయ వేదికలపై వరుసగా అద్భుత ప్రదర్శనలతో అదరగొడుతూ, పురుషుల జావెలిన్ త్రో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తిరిగి నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ క్రమంలో గ్రెనడాకు చెందిన అండర్సన్ పీటర్స్‌ను వెనక్కి నెట్టాడు.