టీవీ జర్నలిస్ట్ స్వేచ్ఛ ఇక లేరు
NEWS Jun 27,2025 05:33 pm
ప్రముఖ టీవీ జర్నలిస్ట్, కవయిత్రి స్వేచ్ఛ తన నివా సంలో ఆత్మహత్య చేసుకున్నారు. తను ప్రస్తుతం T న్యూస్ ఛానల్‌లో స్పెషల్ కరెస్పాండెంట్‌గా పని చేస్తోంది. గతంలో టీవీ9 ఛానల్ తో పాటు 10టీవీ, హెచ్ఎంటీవీ, వి6 ఛానెల్ లో పని చేసింది. వివిధ అంశాలపై అవగాహన కలిగి ఉన్న ఆమె స్వేచ్ఛగా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వచ్చారు. కవ యిత్రిగా తన గొంతును వినిపించారు. తెలంగాణ ప్రాంతం పట్ల మంచి పట్టు కలిగిన జర్నలిస్ట్ గా పేరు పొందారు స్వేచ్ఛ. ఆమె తల్లి శ్రీదేవి, తండ్రి తెలంగాణ శంకర్. తన మృతితో పదునైన జర్నలిస్టును కోల్పోవడం బాధాకరం.