'ఫోన్ ట్యాపింగ్ కేసులో తొలి బాధితుడిని'
NEWS Jun 27,2025 04:16 pm
ఎంపీ రఘునందన్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తొలి బాధితుడిని తానేననన్నారు. అది విచారణా లేక డైలీ సీరియలా అని ప్రశ్నించారు. విచారణ పేరుతో టైమ్ పాస్ చేస్తున్నారని ఆరోపించారు. చిత్తశుద్ది ఉంటే ప్రభాకర్ రావును ఎందుకు అరెస్ట్ చేయడం లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ విచారణ గాంధీ భవన్ పంచాయితీలా ఉందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ములాఖత్ అయ్యాయని దీంతో అర్థమవుతోందన్నారు.