అంగన్వాడీలకు వేతన చట్టం అమలు చేయాలి
NEWS Jun 27,2025 05:32 pm
అంగన్వాడీలకు కనీస వేతన చట్టం అమలు చేయాలని సీఐటీయూ నాయకులు మాల్యాద్రి డిమాండ్ చేశారు. పామూరులో అంగన్వాడి కార్యకర్తలతో కలిసి మహిళా శిశు సంక్షేమ శాఖ సూపర్వైజర్ పద్మ కు సమ్మె నోటీసులు అందజేశారు. అంగనవాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతన చట్టం అమలు చేయాలని జులై నెల 9న జరిగే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో అంగన్వాడీలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు ఆయన కోరారు.