విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీపి కబురు చెప్పారు. కూటమి ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదన్నారు. వచ్చే ఎన్నికల లోపు వీలైనంత వరకు విద్యుత్ చార్జీలు తగ్గించాలనే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రజలను నాణ్యమైన విద్యుత్ అందించడమే తమ ప్రభుత్వం లక్ష్యం అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యుత్ కనెక్షన్ లేని గృహం ఉండకూడదని సీఎం చంద్రబాబు ఆదేశించారని తెలిపారు.