మావోయిస్టుల లేఖపై సీతక్క అనుమానం
NEWS Jun 27,2025 03:58 pm
తన పేరుతో మావోయిస్టులు రాసిన లేఖ కలకలం సృష్టించడంతో స్పందించారు మంత్రి దాసరి సీతక్క. అది వారు రాసారా లేక వేరే వారు రాశారా అన్న అనుమానం వ్యక్తం చేశారు. తనను టార్గెట్ చేస్తూ, కించ పరిచేలా కామెంట్స్ చేయడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఇప్పటికీ ఎప్పటికీ అడవి బిడ్డనేనని అన్నారు. కొందరు కావాలని తనను బద్నాం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తాను ములుగు, ఆదిలాబాద్, తదితర ప్రాంతాలను పర్యటిస్తూనే ఉన్నానని, 49 జీవోను అడ్డుకున్నానని చెప్పారు.