తొక్కి చంపేసే వాళ్లకు పర్మిషన్ ఇస్తే ఎలా..?
NEWS Jun 27,2025 03:26 pm
వైసీపీ బాస్ జగన్ రెడ్డిని ఏకి పారేశారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. బల ప్రదర్శనలు చేసి, సామాన్యులను తమ వాహనాల టైర్ల కింద ఎంతమందినైనా తొక్కేసి చంపేస్తే ఇప్పటి వరకు చర్యలు ఎందుకు తీసుకోలేదంటూ ప్రశ్నించారు. వైసీపీకి ఆంక్షలు ఉండవని, కానీ ఇదేమి న్యాయం అని ప్రశ్నించే తమకు మాత్రం అనుమతి ఇవ్వక పోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. తమ పార్టీ నిరాహారదీక్ష చేపడితే అడ్డుకుంటే ఎలా అని ప్రశ్నించారు.