సింగరాయకొండ మండలం పాకలలో విషాదం చోటుచేసుకుంది. ఉపాధి హామీ పనికి వెళ్లిన లాజరు గుండెపోటుతో మృతి చెందాడు. ఉపాధి పనులు చేస్తుండగా లాజరు ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు. వెంటనే సహచరులు స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే అతను మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.