సింగరాయకొండలో ఎస్సీ విద్యార్థుల సంక్షేమ వసతి గృహాన్ని మంత్రి డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తనిఖీ చేశారు. వసతి గృహంలో జరుగుతున్న ఆధునీకరణ పనులను పరిశీలించారు. హాస్టల్ గదులను, వంటశాలను పరిశీలించి నిర్వాహకులతో మాట్లాడారు. విద్యార్థులకు భోజనాన్ని రుచిగా, శుచిగా వండి వడ్డించాలని మంత్రి ఆదేశించారు.