ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ వేగం
NEWS Jun 27,2025 11:48 am
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. విచారణను వేగవంతం చేసింది సిట్. ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు విచారణలో కీలక ఆధారాలు సేకరించారు. ఇప్పటి వరకు 4 వేలకు పైగా ప్రముఖుల ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ చేసినట్లు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాధితుల నుంచి వాంగ్మూలాలు సేకరించింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 200 మంది నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు గుర్తించింది. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ సిట్ ముందు విచారణకు హాజరయ్యారు.