కేరళలో భారీ వర్షాలు..ముగ్గురు మృతి
NEWS Jun 27,2025 11:42 am
కేరళలో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. ముగ్గురు మృతి చెందగా భారీగా ఆస్తి నష్టం చోటు చేసుకుంది. అలప్పుజలో ఇద్దరు మృతి చెందగా, పల్లురుత్తికి చెందిన 18 ఏళ్ల బాలిక రోడ్డు పక్కన ఉన్న దుకాణం కూలి పోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రైల్వే ట్రాక్ లపై చెట్లు పడి పోయాయి. దీంతో రైల్వే సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.