ఎస్బీఐ నిర్ణయం సరైనదే - హైకోర్టు
NEWS Jun 27,2025 11:13 am
చెన్నై హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సిబిల్ స్కోర్ తక్కువగా ఉందని కార్తికేయన్ అనే ఉద్యోగిని జాబ్ నుండి తీసేసింది ఎస్‌బీఐ. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు బ్యాంకు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. ప్రజాధనం నిర్వహించే వ్యక్తికి ఆర్థిక క్రమశిక్షణ అవసరమని స్పష్టం చేసింది. లోన్లు తీసుకోని కట్టకుండా, సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నవారిపై నమ్మకం ఎలా కలుగుతుందని ప్రశ్నించింది. కేసును కొట్టేసింది హైకోర్టు.