డ్రగ్స్ పై ఫిర్యాదులకు వాట్సాప్, టోల్ ఫ్రీ నెంబర్లు
NEWS Jun 27,2025 10:42 am
ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. డ్రగ్స్, గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలని పిలుపునిచ్చారు. ఎవరైనా గీత దాటితే, వీటిని విక్రయించినా లేదా వాడినా కఠిన చర్యలు తప్పవన్నారు. వీటిని సరఫరా చేస్తే వారికి సంబంధించిన ఆస్తులను జప్తు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. డ్రగ్స్, గంజాయిపై ఫిర్యాదు చేసేందు కోసం వాట్సాప్, టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేశామన్నారు. 1972 టోల్ ఫ్రీ, 8977781972లకు చేయాలన్నారు.