ఇక నుంచి రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణపై ఎక్కువగా దృష్టి సారించాలని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్బంగా ఈగల్ పేరుతో లోగోను ఆవిష్కరించారు. ఇక నుంచి ఈగల్ గా నార్కోటిక్ బ్యూరో పని చేస్తుందన్నారు. ఎక్కడ గంజాయి కనిపించినా ఇది పట్టుకుంటుందని స్పష్టం చేశారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను మార్చాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ నియంత్రణ కు ఫుల్ పవర్స్ ఇచ్చామన్నారు.