అక్రమ కేసులపై గవర్నర్ కు బొత్స ఫిర్యాదు
NEWS Jun 26,2025 09:38 pm
ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో వైసీపీ నేతలు గురువారం ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పిందని, పనిగట్టుకుని తమ పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ప్రజా ప్రతినిధులు, నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ వినతిపత్రం సమర్పించారు. జగన్ పర్యటనలో సెక్యూరిటీ వైఫల్యం గురించి ఏకరువు పెట్టారు. సింగయ్య మృతి ఘటనలో తమ నాయకుడిని ఏ2గా చేర్చారని వాపోయారు. ఈ కేసులో తన పేరు తొలగించాలని కోరారు.