అన్నపూర్ణ భోజన కేంద్రాల పేరు మార్పు
NEWS Jun 26,2025 09:25 pm
హైదరాబాద్ నగర పాలక సంస్థ కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు రూ. 5కే అన్నపూర్ణ కేంద్రాలను నిర్వహిస్తూ వచ్చింది. దీనిని గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేశారు. ఇస్కాన్ సంస్థ సహకారంతో వీటిని నిర్వహిస్తున్నారు. పేదలు, నిరుద్యోగుల, కూలీల ఆకలిని తీరుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ రావడంతో అన్నపూర్ణ భోజన కేంద్రాల పేరును మార్చుతున్నట్లు ప్రకటించింది జీహెచ్ఎంసీ. ఇక నుంచి ఇందిరమ్మ క్యాంటీన్లుగా మార్చాలని స్టాండింగ్ కమిటీ నిర్ణయించింది.