ఆంధ్రోళ్ల బిర్యానీ మనమేం తింటం..?
NEWS Jun 26,2025 09:19 pm
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆంధ్రోళ్లను లక్ష్యంగా చేసుకున్నారు. వాళ్లు చేసిన బిర్యానీని మనమేం తింటామంటూ ఎద్దేవా చేశారు. తన తండ్రి కేసీఆర్ ఆంధ్ర బిర్యానీ గురించి ఎప్పుడో చెప్పాడని మరోసారి గుర్తు చేశారు. కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. రేవంత్ రెడ్డి పాలన గాడి తప్పిందని ఆరోపించారు. 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.