యోగా సరే విభజన హామీలపై మాటేంటి..?
NEWS Jun 26,2025 09:09 pm
పీఎం మోదీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. యోగా చేసి తను తృప్తి పడితే సరిపోదని, రాష్ట్ర ప్రజలంతా తృప్తి పడేలా ఒక్క ప్రకటన అయినా చేశారా అని ప్రశ్నించారు. విభజన హామీల ఊసే ఎత్తడం లేదని, అయినా ప్రధాని భజన చేయడంలోనే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు బిజీగా మారారని ఆరోపించారు. వివేకా ను చంపి సునీత మీద నెట్టేసినోళ్ళకు, సింగయ్యను తొక్కి చంపి AI గ్రాఫిక్స్ అనడం ఒక లెక్కనా అంటూ మండిపడ్డారు.