ఇందిరమ్మ ఇళ్లతో నెరవేరిన పేదవారి కల
NEWS Jun 27,2025 12:22 pm
కథలాపూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇల్లులో మంజూరైన ఇంటికి ముగ్గు పోసి ప్రారంభించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. పేదవారి ఇంటి కల కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమైందని అన్నారు. మండలంలో గత ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా ముగ్గు పోసి ప్రారంభించలేదని, వచ్చిన 18 నెలల్లో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ, పేదవారికి అన్ని ఫలాలు అందే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని రానున్న స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. సీనియర్ నాయకులు వెలిచాల సత్యనారాయణ, నవనంది శేఖర్, ఆకుల సంతోష్, ఎంపీడీవో శంకర్ , కార్యదర్శి సాయి తదితరులు పాల్గొన్నారు.