తెలంగాణ సర్కార్ తీపికబురు
NEWS Jun 26,2025 02:13 pm
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఓ శుభవార్త అందించింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న మెడికల్ రీయంబర్స్‌మెంట్ బిల్లులకు సంబంధించిన నిధులను విడుదల చేసింది. మొత్తం రూ.180.30 కోట్ల విలువైన వైద్య బిల్లుల బకాయిలకు సంబంధించి నిధులు విడుదల చేసినట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 26,519 మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఉపశమనం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.