రోడ్డెక్కిన పొగాకు రైతులు
NEWS Jun 26,2025 10:23 pm
ప్రకాశం జిల్లా కొండేపి పొగాకు వేలం కేంద్రంలో గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. జువ్విగుంట, వెంకట కృష్ణాపురం, అయ్యవారిపాలెం, గ్రామాల రైతులు వేలం నిలిపివేసి గిట్టుబాటు ధర కల్పించాలంటూ రోడ్డు ఎక్కి నిరసన తెలియజేశారు. సుమారు గంటపాటు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. కూటమి ప్రభుత్వం పొగాకు రైతులకు అండగా ఉండాలని, కనీసం పెట్టుబడి డబ్బులు కూడా రైతుకి రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.