శ్రీవారి ప్రాణదాన ట్రస్టుకు భారీ విరాళం
NEWS Jun 26,2025 08:24 am
టీటీడీకి ఇవాళ భారీగా విరాళాలు అందాయి. ప్రముఖ టెక్నాలజీ సంస్థ గూగుల్ వైస్ ప్రెసిడెంట్, ఎన్నారై అయిన తోట చంద్రశేఖర్ టీటీడీ నిర్వహిస్తున్న ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు కోటి రూపాయల భారీ విరాళాన్ని అందించారు. మరోవైపు అమలాపురానికి చెందిన ఓ భక్తుడు పెద్ద సంఖ్యలో హెల్మెట్లను దేవస్థానానికి సమర్పించారు.