కొండేపిలో గురువారం పొగాకు రైతులు నిరసనకు దిగారు. గిట్టుబాటు ధర కల్పించకుండా ఇబ్బందులు కలిగిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పొగాకు బోర్డు కార్యాలయానికి తాళం వేసి అక్జడే బైఠాయించారు. పోలీసులు, వేలం కేంద్ర అధికారులు వారిని సముదాయించేందుకు ప్రయత్నించినా రైతులు నిరసన విరమించలేదు. పొగాకు రైతులతో అధికారులు చర్చలు జరుపుతున్నారు.