విశాఖలో కాగ్నిజెంట్ నూతన ఐటీ క్యాంపస్
NEWS Jun 26,2025 04:23 am
ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ కీలక ప్రకటన చేసింది. విశాఖ కాపులుప్పాడలో 22 ఎకరాల్లో నూతన క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. సుమారు ఎనిమిది వేలమందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపింది. ఏఐ, డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ రంగంలో జాబ్స్ భర్తీ చేస్తామని పేర్కొంది. వచ్చే ఏడాది 2026 నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తామని తెలిపింది. 2029 నాటికి ఐటీ క్యాంపస్ తొలి దశ పూర్తి చేస్తామని, ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలిపింది.