టెక్నాలజీ బైక్ లను ప్రారంభించిన ఎస్పీ
NEWS Jun 25,2025 10:33 pm
ట్రాఫిక్ నియంత్రణ కోసం అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన 16 నూతన బైక్ లను ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ఎస్పీ దామోదర్ జెండా ఊపి ప్రారంభించారు. ఎస్పీ మాట్లాడుతూ ఈ బైక్ లకు సైరన్, బ్లింకర్స్, పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టం, ప్రథమ చికిత్స కిట్, క్రౌడ్ కంట్రోల్ చేయడానికి అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించారన్నారు. ఎక్కడికైనా త్వరగా చేరుకోవడం, ప్రమాద సమయంలో తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు.