వైసీపీలో చేరిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం
NEWS Jun 25,2025 01:37 pm
రాయలసీమ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ సీనియర్ నాయకులు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఆ పార్టీని వీడి వైసీపీలో చేరారు. వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. రాజంపేట టీడీపీలో తనకు ఎదురవుతున్న అవమానాల కారణంగానే పార్టీని వీడి, జగన్ నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు బాలసుబ్రహ్మణ్యం తెలిపారు.