29న మార్కాపురంలో మెగా జాబ్ మేళా
NEWS Jun 25,2025 07:21 pm
రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 29న మార్కాపురంలోని సాధనా డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి రవితేజ యాదవ్ చెప్పారు. 10 బహుళ జాతి కంపెనీలు పాల్గొంటున్నాయని తెలిపారు. 18 నుంచి 30 ఏళ్లలోపు వయస్సు ఉండి పది నుంచి పీజీ వరకు చదువుకున్న నిరుద్యోగ యువతీ యువకులు అర్హులని వివరించారు.