ప్రియుడితో కలిసి తల్లిని చంపిన కూతురు
NEWS Jun 25,2025 01:42 pm
హైదరాబాద్‌లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన అంజలి హత్య కేసును పోలీసులు కేవలం 24 గంటల్లో ఛేదించారు. ప్రేమ వ్యవహారానికి అడ్డు వస్తోందన్న కారణంతో పదో తరగతి చదువుతున్న కుమార్తె, ఆమె ప్రియుడు, అతని సోదరుడితో కలిసి తల్లిని దారుణంగా హత్య చేసిందని బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ వెల్లడించారు.