సింగయ్య మృతి కేసులో జగన్ క్వాష్ పిటిషన్
NEWS Jun 25,2025 01:53 pm
సింగయ్య మృతి కేసులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయనున్నారు మాజీ సీఎం జగన్. ఇదే కేసులో మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజిని క్వాష్ పిటిషన్ల విచారణ సందర్బంగా కోర్టుకు తెలిపారు జగన్ తరపు న్యాయవాదులు. ఆయనతో పాటు మాజీ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, కేఎన్ఆర్ కూడా దాఖలు చేయనున్నారు. అన్ని పిటిషన్లను విచారించాలని కోరారు కోర్టును. ఇదిలా ఉండగా సింగయ్య కేసులో జగన్ ను ఏ2గా చేర్చారు. డ్రైవర్ రమణా రెడ్డిని ఏ1గా చేర్చారు పోలీసులు.