వైసీపీ శ్రేణులకు జగన్ భరోసా
NEWS Jun 25,2025 06:45 am
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు మాజీ సీఎం జగన్ రెడ్డి. తన అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ నేతల అరెస్ట్‌లు, సూపర్ సిక్స్ పథకాల అమలు, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రధానంగా చర్చించారు. భవిష్యత్ కార్యాచరణపై దిశా నిర్దేశం చేశారు జగన్. 175 నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు, పార్టీ పరిశీలకులు పాల్గొన్నారు.