భూసేకరణ చేసేది రాజధాని నిర్మాణం కోసమా? రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమా అని నిప్పులు చెరిగారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి. ఇంకెన్ని వేల ఎకరాల భూమి కావాలో చెప్పాలన్నారు. మీరు నగరాన్ని కడుతున్నారా లేక రాజధానిని నిర్మిస్తున్నారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. రాజధానిని నిర్మించాలని ప్రజలు పట్టం కడితే భూ సేకరణ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు కాదన్నారు.