జీడి కార్మికుల ర్యాలీని ఖండించిన యాజమాన్యాలు
NEWS Jun 25,2025 10:34 pm
మందసలో జీడి కార్మికుల ర్యాలీని జీడి యాజమాన్యాల ప్రతినిధులు ఖండించారు. వారు మీడియాతో మాట్లాడుతూ పలాసలో సుమారు 200 ఫ్యాక్టరీలు కేజీ జీడిపప్పుకు రూ 34, హరిపురం లో గల సుమారు 20 ఫ్యాక్టరీలు రూ. 33 కార్మికులకు చెల్లిస్తున్నారని తెలిపారు.పలాస వలె కేజీ కు రూ 34 చెల్లిస్తామని తెలిపిన మందస లోని కార్మికులు అంగీకారం తెలపకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కార్మిక సంఘ నాయకులు, అధికారులు దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలన్నారు.