ఏపీకి ప్రత్యేక హోదా రావాలన్నా, విభజన హామీలన్నీ నెరవేరాలన్నా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గెలవాలని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల చెప్పారు. ఒంగోలులో మంగళవారం పర్యటించిన షర్మిల అనంతరం పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలపడవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ఆ దిశగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామన్నారు