కాంగ్రెస్ పార్టీ నాయకులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సూచనలు
NEWS Jun 24,2025 07:14 pm
భవిష్యత్తులో అనేక సవాళ్లు ఎదురుకానున్నందున వాటిని అధిగమించేందుకు నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. డీలిమిటేషన్ ప్రక్రియ, మహిళా రిజర్వేషన్ల అమలు, జమిలి ఎన్నికల నిర్వహణ వంటి కీలక పరిణామాలు భవిష్యత్తులో చోటుచేసుకోనున్నాయని ఆయన పార్టీ నేతలకు వివరించారు. పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.