ఘనంగా శివాజీ జయంతి వేడుకలు
NEWS Feb 19,2026 03:34 pm
భూమి ఉన్నంతవరకు, భూమిపై మనుషులు ఉన్నంతవరకు ఛత్రపతి శివాజీ మహారాజ్ చిరస్మరణీయుడని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అన్నారు. శివాజీ చౌక్‌లో పురపాలక సంఘం ఆధ్వర్యంలో శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శివాజీ తండ్రి షాహాజీ భోసలే పూణే జాగీరు వ్యవహారాలను తన భార్యకు అప్పగించి, యువకుడైన శివాజీకి రాజనీతి, పరిపాలన విషయాలు నేర్పేందుకు ముఖ్య అనుచరులతో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి తాను బెంగుళూరు జాగీరుకు వెళ్లారని వివరించారు. అప్పటి నుంచి తల్లి జీజాబాయి శివాజీకి పుట్టిన భూమి, ప్రజలపై అపారమైన ప్రేమ కలిగేలా విద్యాబుద్ధులు నేర్పారని తెలిపారు.