దంగేటి జాహ్నవిని అభినందించిన జగన్
NEWS Jun 24,2025 07:08 pm
భారతదేశానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణంగా నిలుస్తూ, యువ ప్రతిభావంతురాలు కుమారి జాహ్నవి దంగేటి అరుదైన ఘనత సాధించారు. ప్రతిష్టాత్మక టైటాన్స్ స్పేస్ సంస్థ నిర్వహించే ఆస్కాన్ (ASCAN) ప్రోగ్రామ్‌కు ఆమె ఆస్ట్రోనాట్ క్యాండిడేట్ (వ్యోమగామి అభ్యర్థి)గా ఎంపికయ్యారు. 2029లో చేపట్టతలపెట్టిన అంతరిక్ష యాత్ర కోసం ఆమె ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ వార్త తెలియగానే జాహ్నవికి సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.