నానిపై హత్యాయత్నం కేసులో ఛార్జ్ షీట్
NEWS Jun 24,2025 02:01 pm
ఎమ్మెల్యే పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో పోలీసులు తిరుపతి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఘటన జరిగి ఏడాదైంది. 2024 మే 14న పద్మావతి యూనివర్శిటీ వద్ద పులివర్తి నానిపై చెవిరెడ్డి వర్గీయులు కర్రలు, రాడ్ లతో దాడికి పాల్పడ్డారు. వాహనాలు సైతం ధ్వంసం చేశారు. ఈ దాడిలో నానితో పాటు గన్ మెన్ గాయపడ్డారు. ఈ ఘటనలో 37 మంది పాల్గొన్నట్లు గుర్తించారు.