జగన్ కు షాక్.. కేసు నమోదు
NEWS Jun 24,2025 08:55 am
మాజీ సీఎం జగన్ కు బిగ్ షాక్ తగిలింది. మొన్న సింగయ్య మృతి చెందిన ఘటనలో తనను ఏ2గా చేర్చారు పోలీసులు. తాజాగా గుంటూరు జిల్లా పర్యటనలో భాగంగా నిబంధనలు పాటించలేదంటూ తనపై కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు వైసీపీ నేతలు కావటి మనోహర్, అప్పిరెడ్డి, మోదుగుల, మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పాటు పలువురికి నోటీసులు జారీ చేశారు. నల్లపాడు పీఎస్ లో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.