పేదరిక నిర్మూలనే నా లక్ష్యం - సీఎం
NEWS Jun 24,2025 10:22 am
సమాజంలో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని వాటిని రూపు మాపేందుకు కూటమి సర్కార్ కృషి చేస్తోందన్నారు సీఎం చంద్రబాబు. ధనవంతుడు ఇంకా ధనికుడు అవుతున్నాడని. పేదవాడు ఇంకా పేదరికంలోకి వెళ్తున్నాడని వాపోయారు. సమాజం అండతో పైకి వచ్చిన వారు తిరిగి సమాజానికి ఇవ్వాలని పిలుపునిచ్చారు. బిల్‌గేట్స్ తన సంపదలో 99 శాతం తిరిగి సమాజానికి ఇస్తున్నారని గుర్తు చేశారు. సరైన సమయంలో సరైన సాయం చేస్తే అనేక మంది పైకి వస్తారనన్నారు.