కవితపై కస్సుమన్న పొన్నం ప్రభాకర్
NEWS Jun 24,2025 07:33 am
మంత్రి పొన్నం ప్రభాకర్ నిప్పులు చెరిగారు ఎమ్మెల్సీ కవితపై. తనకు బీసీల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. కవిత సత్రంలో భోజనం పెడుతుంటే కూడా సిఫార్సు లెటర్ కావాలనే రకం అంటూ ఎద్దేవా చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏనాడైనా బహుజనుల గురించి మాట్లాడిందా అని ప్రశ్నించారు. తను ఏం సాధించిందని ఎంపీ ఆర్. కృష్ణయ్య మద్దతు పలకడం దారుణమన్నారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. కేసీఆర్ కు అంత సీన్ లేదన్నారు. బీసీలకు న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు.