టెక్కలి డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ఓపీ విభాగం వద్ద రోగులు అవస్థలు పడ్డారు. ఓపీ విభాగంలోని కంప్యూటర్ సాంకేతిక సమస్య కారణంగా వివిధ ఆరోగ్య సమస్యల కోసం చికిత్సకు వచ్చిన రోగులకు ఓపీ రసీదులు అందకపోవడంతో.. క్యూ లైన్లో నిరీక్షించాల్సిన దుస్థితి తలెత్తింది. కొందరు రోగులు నిరాశతో వెనుదిరగగా మరికొందరు క్యూలైన్లో పడిగాపులు కాశారు.