తెలంగాణ పంచాయతీ ఎన్నికలపై హైకోర్టులో వాదనలు పూర్తి..
NEWS Jun 23,2025 07:19 pm
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ అంశంపై రాష్ట్ర హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ మరియు పిటిషనర్ల తరఫున వాదనలు సోమవారం ముగిశాయి. ఇరు పక్షాల వాదనలను విన్న ఉన్నత న్యాయస్థానం, తన తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో, పంచాయతీ ఎన్నికల భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది.