సింగయ్య చావుకు జగనే కారణం
NEWS Jun 23,2025 06:19 pm
ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు మాజీ సీఎం జగన్ పై. తన కారణంగానే సింగయ్య మరణించాడని వాపోయారు. జన సమీకరణ బలం చూపించేందుకే వెళ్లాడని ప్రజా సమస్యల కోసం కాదని ఎద్దేవా చేశారు. తనను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తన కారు కింద పడితే పరామర్శించకుండా ఎలా ఉంటారని ప్రశ్నించారు. తనలో మానవత్వం అన్నది లేకుండా పోయిందన్నారు. వెంటనే బేషరతుగా ఆ కుటుంబానికి క్షమాపణ చెప్పాలని, రూ. 5 కోట్లు పరిహారంగా ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారు.